*వార్తలు ఉచితంగా కావాలి…*
*ప్రకటనలు ఇవ్వాలంటే ముఖం చాటేస్తారా?*
*జర్నలిస్టుల వార్తలతో నిత్యం రాజకీయ ప్రచారం*
*ప్రకటనల దగ్గర మాత్రం చేతులెత్తేస్తారు?*
*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 18 సంగారెడ్డి జిల్లా*
ఏడాది పొడవునా రాజకీయ నాయకుల కార్యక్రమాలు, సమావేశాలు , పర్యటనలు, ప్రకటనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు వార్తలు రాస్తూనే ఉంటారు . ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ వృత్తి లో బాగంగా రాజకీయ నాయకులకు ప్రచారం కల్పిస్తుంటారం. కానీ ఏడాదికి రెండు సార్లు వచ్చే దసరా, నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకటనల విషయం లో మాత్రం కొందరు రాజకీయ నాయకులు ముఖం చాటేయడం ఎంతవరకు సమంజసం.?
*వార్తలు కావాలంటే గుర్తొస్తారు…. ప్రకటనలు అడిగితే కనిపించేలా.?*
జర్నలిస్టులు ప్రకటనల కోసం కార్యాలయాలకు వస్తే కనీస స్పందన కూడా ఇవ్వకపోవడం, ప్రకటనల విషయం లో తప్పించుకోవడం ఎంతవరకు న్యాయం? ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు తమ హోదాకు తాగిన విధంగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? మిరు ఏ పార్టీలో ఉన్నా..ఏ పదవి లో ఉన్న.. మీ కార్యక్రమాలను
ప్రజలకు చేరవేయడం లో జర్నలిస్టుల పాత్రను విస్మరించకండి. రాజకీయ నాయకుల కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం జర్నలిస్టుల వృత్తి లో భాగమే. అదే సమయంలో పత్రికల నిర్వహణకు, జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలకు ప్రకటనలు ఎంతో తోడ్పడుతాయి.
*జర్నలిస్టు మిత్రులకు విజ్ఞప్తి*
ప్రకటనల కోసం వేళ్ళినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకుల విషయం లో సంఘటితంగా, వృత్తి గౌరవాన్ని కాపాడుకంనేలా నిర్ణయం తీసుకోండి. ప్రకటనలు ఇవ్వకుండా తప్పించుకునే వారి వార్తలకు ప్రచారం కల్పించే విషయంలో మీ సంఘం విధానాల ప్రకారం సమిష్టిగా చర్చించండి. వార్తల విషయంలో వృత్తి ప్రమాణాలను పాటిస్తూనే, ప్రకటనల విషయంలోనూ పరస్పర గౌరవం ఉండేలా కృషి చేయండి. గుర్తుంచుకోండి. జర్నలిస్టులు ఎవరికీ వ్యతిరేకం కాదు. అలాగే ఎవరి ప్రచారానికి బానిసలు కాదు. ప్రజప్రతినిదుల కార్యక్రమాలకు వార్తా ప్రాధాన్యం ఉంటే ప్రచురించడం వృత్తి ధర్మం. అదే సమయంలో జర్నలిస్టుల కృషిని గుర్తించి, ప్రకటనల విషయంలోనూ న్యాయంగా స్పందించడం ప్రజా ప్రతినిధుల బాధ్యత. వార్తలు ఉచితంగా రాయించుకోవడం మాత్రమే కాదు.. జర్నలిస్టుల వృత్తిని గౌరవించడం నేర్చుకోండి!

