📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

📰 Generate e-Paper Clip

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు డిమాండ్

బెజ్జంకి, అక్టోబర్ 14 (ప్రజావాణి)

మెదక్ పట్టణంలోని ఆటోనగర్‌లో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను సిద్దిపేట జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.చాకలి ఐలమ్మ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.ధ్వంసమైన విగ్రహాన్ని వెంటనే పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం,పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.