చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు డిమాండ్ బెజ్జంకి, అక్టోబర్ 14 (ప్రజావాణి) మెదక్ పట్టణంలోని ఆటోనగర్‌లో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను సిద్దిపేట జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.చాకలి ఐలమ్మ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.ధ్వంసమైన...