ఘనంగా జనగామ మున్సిపాలిటీ 74 వసంతాల వేడుకలు

ఘనంగా జనగామ మున్సిపాలిటీ 74 వసంతాల వేడుకలు జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01(ప్రజావాణి): జనగామ పురపాలక సంఘం మున్సిపాలిటీ స్థాపించబడి 74 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో 74వ జన్మదిన వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమక్షంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పురోగతి, పట్టణాభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేక్ కటింగ్ వేడుక: పురపాలక సంఘం 74 వసంతాలు పూర్తి చేసుకున్న సంతోషంతో చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్...