ఘనంగా ఘనపురంలో సీతారామాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం …ముఖ్య అతిధి గా పాల్గొన్న వేముల మమత మహేష్ గౌడ్
ఘట్కేసర్, అక్టోబర్ 22 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్, చైర్మన్, మాజీ సర్పంచ్ వేముల మమత మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి నిర్వహించిన అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు...