📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్‌కేసర్ సర్కిల్ 6వ వార్డులో బల్ద కల్పనకు సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు...

ఘట్‌కేసర్ సర్కిల్ 6వ వార్డులో బల్ద కల్పనకు సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు మంజూరు…బొక్క విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో బాధితురాలికి ఆర్థిక భరోసా

📰 Generate e-Paper Clip

 

ఘట్‌కేసర్, అక్టోబర్ 14 (ప్రజా వాణి):ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ వార్డుకు చెందిన మర్పల్లిగూడ గ్రామ నివాసి బల్ద కల్పన అనారోగ్యంతో బాధపడుతూ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఎల్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది.

బొక్క విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో మంజూరైన ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును మల్లారెడ్డి కల్పనకు అందజేశారు. ఈ సాయం వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబానికి ఎంతో ఊరటనివ్వనుంది. ఆపద సమయంలో సహకారం అందించిన వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కల్పన త్వరగా కోలుకోవాలని స్థానికులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.