వీడియో కాన్ఫరెన్స్ వీక్షించిన సర్పంచులు రైతులు..
ప్రజావాణి,నెల్లికుదురు: ఎల్ నినోపై ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ను మండలంలోని మిగలవీడు రైతు వేదికలో సోమవారం ప్రజా ప్రతినిధులు రైతులు ఏ ఈ ఓ ప్రతిభ ఆహ్వానం మేరకు హాజరై వీక్షించారు.మునిగల వీడు సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు, ఉపసర్పంచి కొమ్మనబోయిన మల్లయ్య,మదనతుర్తి సర్పంచి వడ్ల కొండ రాధ యాకయ్య,బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నల్లాని పాపారావు,వివిధ గ్రామాల రైతులు ఎల్ నినో పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ను ఆసక్తిగా తిలకించారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, ఇతర అధికారులు ఎల్ నినో ప్రభావం వ్యవసాయం తో పాటు దాని అనుబంధ రంగాలపై పడుతుందని తెలిపారు. విద్యుత్ సరఫరాకు కొంత అంతరాయం ఏర్పడవచ్చుని,సాగునీరు త్రాగునీరు కు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నీటి ఆధారిత పంటలు కాకుండా ఆరుతడి పంటల వైపు రైతాంగం దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఎల్ నినో ను అధిగమించేందుకు అవసరమగు ముందస్తు చర్యలు తీసుకోవాలని చించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి.వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతిభ, నాయకులు దేవేందర్ రాజలింగం,దుస్స లింగయ్య,జనార్ధన్ ఫీల్డ్ అసిస్టెంట్ రవి రైతులు తదితరులు పాల్గొన్నారు.
.

