📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంచల్ మండల కులగణన వివరాలను గ్రామాల వారీగా వెల్లడించాలి

మంచల్ మండల కులగణన వివరాలను గ్రామాల వారీగా వెల్లడించాలి

📰 Generate e-Paper Clip

*మంచల్ మండల కులగణన వివరాలను గ్రామాల వారీగా వెల్లడించాలి*

*ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన డా. బాలకోటి నాయక్* , మహేంద్ర భాగత్

రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 12: మంచాల (ప్రజావాణి)
మంచల్ మండలంలోని మొత్తం జనాభా వివరాలతో పాటు, ఇటీవల నిర్వహించిన కులగణనకు సంబంధించిన తాజా వివరాలను మండల స్థాయిలో, గ్రామాల వారీగా, కులాల వారీగా వెల్లడించాలని కోరుతూ మంచల్ మండల ఎంపీడీవోకు డా. బాలకోటి నాయక్, మహేంద్ర భాగత్ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డా. బాలకోటి నాయక్ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామానికి సంబంధించిన తాజా జనాభా వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ముఖ్యంగా మండలంలోని మొత్తం జనాభా ఎంత? గ్రామాల వారీగా జనాభా ఎంత? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాలతో పాటు మైనారిటీల జనాభా ఎంత? అనే వివరాలను స్పష్టంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణనకు సంబంధించిన అధికారిక నివేదికలు, అందుబాటులో ఉన్న గణాంకాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలు, వివిధ వర్గాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

కావున, మంచల్ మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన తాజా జనాభా వివరాలు, కులాల వారీ గణాంకాలను అధికారిక రికార్డుల ఆధారంగా ప్రజలకు అందించాలని ఎంపీడీవో కు వినతి పత్రం అందజేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.