*గోవిందరావుపేటలో మార్మోగిన కాకులమర్రి బ్రదర్స్ మానవత్వం*
.రాజకీయాలకు అతీతంగా సేవ.. మొద్దులగూడెంలో ప్రశంసలు.
. కష్టంలో ఉన్నవాడికి కాకులమర్రి బ్రదర్స్ అండ. గ్రామస్థుల హర్షం.
.మాటలు కాదు.. చేతల్లో చూపించిన నాయకత్వం.
.బాధితుడికి భరోసాగా లక్ష్మణ్ బాబు, ప్రదీప్ రావు.
*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
ప్రజాసేవ అంటే కేవలం మాటల్లో హామీలు ఇవ్వడం కాదు.. ఆపదలో ఉన్నవారి కష్టాన్ని గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా తక్షణమే స్పందించి అండగా నిలవడంఅని మరోసారి నిరూపించారు కాకులమర్రి బ్రదర్స్ .
ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే ప్రజాసేవకు అసలైన అర్థంఅని ఈ సందేశాన్ని ప్రతిబింబించేలా ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలో మొద్దులగూడెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు మానవతా దృక్పథం చాటుకున్నారు.
నడుము విరిగి మంచానికే పరిమితమైన జల్లుల రమేష్‌కు ఎలక్ట్రిక్ వీల్‌చైర్ జీవనాధారం. అయితే దానికి సంబంధించిన బ్యాటరీలు, మోటార్లు పాడవడంతో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న *ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు స్పందించారు. ఆయన చొరవతో కాకులమర్రి ప్రదీప్ రావు సుమారు రూ.70,000 విలువైన రెండు బ్యాటరీలు, రెండు మోటార్లను రమేష్‌కు అందజేశారు.
వారి సహాయం కేవలం పరికరాలను అందించడానికే పరిమితం కాదు. ఒక వికలాంగుడి స్వతంత్రంగా కదిలే అవకాశానికి తోడ్పడటంతో పాటు , రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడం, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అని చెప్పారు
సహాయం విలువ దాని ధరలో కాదు.. అది ఒకరి జీవితంలో తీసుకొచ్చే మార్పులో ఉంటుందనీ చెప్పారు .
కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ, తన కుమారుడికి నిరంతరం సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రమేష్ తల్లి జీవితం ఎన్నో గ్రామీణ కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రతిబింబం. కుటుంబ బాధ్యతలు, జీవనోపాధి, కుమారుడి సంరక్షణ వంటి అనేక సవాళ్ల మధ్య ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తించి వారు స్పందించడం మానవత్వానికి నిదర్శనం అని గ్రామస్థులు కొనియాడారు.
ప్రజాసేవకు పదవులు అవసరం కావచ్చు.. కానీ ప్రజల బాధను అర్థం చేసుకోవడానికి మానవత్వం అవసరం అని గ్రామ పార్టీ పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు తమ పరిధిలో ఉన్న నిరుపేదలు, వికలాంగులు, వృద్ధులు, ఆపదలో ఉన్న కుటుంబాల సమస్యలను గుర్తించి స్పందించినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందనీ కాకుల మర్రి ప్రదీప్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు, కాకులమర్రి ప్రదీప్ రావు స్పందన ద్వారా ప్రజాసేవలో సకాలంలో సహాయం అందించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైందో ఈరోజు రుజువైంది.
రాజకీయాలకు అతీతంగా, మానవత్వమే ప్రాధాన్యంగా నిలిచినప్పుడే సేవకు సార్థకత లభిస్తుంది పలువురు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మొద్దులగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గజ్జి ఎలంధర్ గారు మండల నాయకులు పోరిక రవికిరణ్ గారు పస్రా Ex.ఎంపీటీసీ స్వరూప, Ex, ఎంపీటీసీ లకావత్ చందులల్ Ex. సర్పంచ్ మోహన్ రాథోడ్ , సర్పంచాలు మాలోత్ గాంధీ, బానోత్ సీతారాం,
పస్రా 4వ ఏకుల ధనుజయ్ గారు ,13వ వార్డు కత్తుల సారయ్య గారు 14 వ వార్డు బక్క సరిత గారు.
గోవిందరావుపేట గ్రామ శాఖ అధ్యక్షులు అక్కేనాపెళ్ళి రమేష్ గారు,లక్ష్మిపురం గ్రామపార్టీ అధ్యక్షలు జల్లెల్ల కొమురయ్య,కుమారస్వామి యూత్ అధ్యక్షులు రుద్రారపు శేఖర్ ఉపాధ్యక్షులు కొయ్యడ శ్రీకాంత్ సోషల్ మీడియా మంచికలపూడి అరుణ్ ఇస్లావత్ శేఖర్ మరియు సీనియర్ నాయకులు తోడుసు వెంకన్న మేడుదల వెంకన్న,మడికొండ రమేష్, ఆరే నరేష్,లకావత్ మమతా,గుగులోతు రమేష్, బుర్రి వీరయ్య, గుండె సోమయ్య, రుద్రారపు లింగయ్య, తుడుసు సారయ్య, బక్క బుచ్చయ్య, కత్తుల సమ్మయ్య, సాదుల ప్రసాద్ గడ్డి, పవన్ జలల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
