📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎల్‌నినో పై పోరుకు సిద్ధం - మంత్రి సీతక్క

ఎల్‌నినో పై పోరుకు సిద్ధం – మంత్రి సీతక్క

📰 Generate e-Paper Clip

*ఎల్‌నినో పై పోరుకు సిద్ధం – మంత్రి సీతక్క*
.అలసత్వానికి చెక్ – గ్రామాభివృద్ధే లక్ష్యం. సీతక్క వార్నింగ్.
. ప్రతి పంచాయతీకి పశువుల నీటి తొట్టె – కీలక ఆదేశం.

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-

ఎల్‌నినో సవాళ్లను అధిగమించేలా గ్రామాలను ముందస్తుగా సన్నద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం బీఆర్‌కే భవన్‌లోని సెర్ప్ కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉపాధి హామీ పనులను జల సంరక్షణతో అనుసంధానించి గ్రామీణ కూలీలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని 12,516 పంచాయతీల్లో పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 244 చోట్ల వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, చెక్‌డ్యామ్‌లు, చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ సందర్భంగా జలసిరి వీడియోను ఆవిష్కరించారు.
ప్రతి గ్రామ పంచాయతీలో పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెలను నిర్మించాలని, మహిళా సంఘ భవనాలను నవంబర్ 19 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ములుగు కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్డీఓ రవీందర్, డీపీఓ వెంకయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.