📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుంతలమయంగా పోచారం - కూసుమంచి బీటీ రోడ్డు మూడేళ్లుగా మరమ్మతులు లేవు

గుంతలమయంగా పోచారం – కూసుమంచి బీటీ రోడ్డు మూడేళ్లుగా మరమ్మతులు లేవు

📰 Generate e-Paper Clip

గుంతలమయంగా పోచారం – కూసుమంచి బీటీ రోడ్డు
మూడేళ్లుగా మరమ్మతులు లేవు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!
అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్‌
కూసుమంచి, అక్టోబర్ 23 (ప్రజావాణి):
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం నుంచి కూసుమంచి వెళ్లే బీటీ రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడటంతో మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా పోచారం–కిష్టాపురం గ్రామాల మధ్య మూలమలుపు వద్ద గతంలో రోడ్డును తవ్వి కంకర పోసి వదిలేశారని, సుమారు మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు ఏర్పడిన చోట్ల కూడా మరమ్మతులు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ రహదారి దుస్థితిపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం ఏమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, గుంతలకు మరమ్మతులు చేపట్టడంతోపాటు పూర్తిస్థాయిలో బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పోచారం గ్రామ ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.