📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriకొమ్మిడి సత్యనారాయణ రెడ్డి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన బండారి శ్రీనివాస్ గౌడ్

కొమ్మిడి సత్యనారాయణ రెడ్డి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన బండారి శ్రీనివాస్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): ఔషాపూర్‌లోని రాక్ గార్డెన్‌లో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సీనియర్ నాయకుడు కొమ్మిడి సత్యనారాయణ రెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్ రావు, బీఆర్‌ఎస్ నాయకులు బిజిలి సదానందం, ఎండీ సిరాజ్, భానుక నవీన్, ఆంజనేయులు, జర్నలిస్టు సోదరులు గాదె యాదగిరి,  నాగిళ్ల నర్సింగరావు తదితరులు  పాల్గొని నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.