📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాంధీ జయంతి వేడుకలకు హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్

గాంధీ జయంతి వేడుకలకు హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

గాంధీ జయంతి వేడుకలకు హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): జనగామ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని గాంధీ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వద్ద, జిల్లా గ్రంథాలయ శాఖ కార్యాలయంలో, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీజీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గాంధీజీ చూపిన అహింస, సత్యాగ్రహం, స్వచ్ఛత అనే ఉన్నతమైన ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన జనగామ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రంథాలయ శాఖ అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.