ప్రతి గ్రామంలో ప్రత్యేక గ్రామసభలు
టేక్మాల్ మండలంలో ఘనంగా నిర్వహణ
టేక్మాల్: అక్టోబర్ 02 మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిది
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని టేక్మాల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సర్పంచ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వీబీజీ రామ్జీ పథకంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, 125 రోజుల ఉపాధి పనిదినాలు, వాటి ద్వారా గ్రామాలకు కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు.
గ్రామ అవసరాలకు అనుగుణంగా ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీఛార్జ్ పనులు, పంట కుంటలు, ఊట కుంటలు, డ్రైనేజీలు, సోక్పిట్లు, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి పనులపై చర్చించారు. అలాగే అంగన్వాడీ భవనాలు, మౌలిక వసతులు, గ్రామ చౌరస్తాల అభివృద్ధి, మరుగుదొడ్లు, పారిశుధ్యం, తాగునీటి వసతుల మెరుగుదల తదితర అవసరాలను గుర్తించి తీర్మానాలు చేశారు.
గ్రామాల ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, మౌలిక వసతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ అవసరాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. గ్రామ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టడమే గ్రామసభల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీవోఏలు, మండల అధికారులు, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

