📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూసుమంచిలో జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

కూసుమంచిలో జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఓటు నమోదు వేగవంతం చేయాలి: జనసేన నాయకులు
కూసుమంచి ప్రజావాణి – అక్టోబర్ 5:
నల్గొండ–వరంగల్–ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా పాలేరు నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ విస్తృత సమావేశం సోమవారం కూసుమంచిలోని ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంలో నిర్వహించారు. జనసేన పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ సమావేశం జరిగింది.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరు, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గ ఎన్నికల కో-ఆర్డినేటర్లు డాక్టర్ మాధవరెడ్డి, జి. రమేష్ గౌడ్, పాలేరు నియోజకవర్గ పీఓసీ సభ్యుడు యాసంనేని అజయ్ కృష్ణ ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పర్యటించి ఓటు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు.పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి, సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, పెద్ద సంఖ్యలో పట్టభద్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.