కూసుమంచిలో జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

పట్టభద్రుల ఓటు నమోదు వేగవంతం చేయాలి: జనసేన నాయకులు కూసుమంచి ప్రజావాణి – అక్టోబర్ 5: నల్గొండ–వరంగల్–ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా పాలేరు నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ విస్తృత సమావేశం సోమవారం కూసుమంచిలోని ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంలో నిర్వహించారు. జనసేన పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ సమావేశం జరిగింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరు, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్...