కర్నాటి వజ్రమ్మ వెంకటేశం కు శాలువా కప్పి సత్కరించిన మాజీ ఎంపీపీ తోకల వెంకన్న
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని హ్యాండ్లూమ్స్ కార్యాలయంలో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ తెలంగాణ ప్రతినిధుల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశంకు ఘనంగా సత్కారం జరిగింది. చండూర్ మండల మాజీ ఎంపీపీ తోకల వెంకన్న ఆధ్వర్యంలో విజేతకు శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. చేనేత కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండూరి జనార్ధన్, ఇరిగి రామన్న, ఇరిగి గురునాథం తదితరులు పాల్గొని విజేతను అభినందించారు. హ్యాండ్లూమ్ రంగ అభివృద్ధికి కర్నాటి వజ్రమ్మ వెంకటేశం చేస్తున్న కృషిని కొనియాడారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుండి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చారు.

