కూటమి అభ్యర్థిగా పెద్దఆర్కూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా సోమక సత్యనారాయణ నామినేషన్ దాఖలు
ప్రజావాణి ప్రతినిధి కూనవరం, అక్టోబర్ 21
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం పెద్దాఆర్కూర్ ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి అభ్యర్థిగా సోమక సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూనవరం 1 ఎంపీటీసీ అభ్యర్థిగా. కోయ్యల కనక లక్ష్మీ ప్రసన్న కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెంకటాయపాలెం ఎంపిటిసి అభ్యర్థిగా ధన్నూరి రమాదేవి నామినేషన్ జరిగింది ఈ సందర్భంగా సత్యనారాయణ.మాట్లాడుతూ కూటమి నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన విజయానికి బాటలు వేస్తాయని తెలిపారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, ముంపు ప్రజలకు ఆర్ అండ్ ఆర్ స్టేక్కర్ వచ్చే విధంగా ప్రభుత్వ తెలియజేస్తూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు – టీడీపీ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి పోడియం అప్పారావు , టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు భరపాటి ప్రకాష్ రావు, కో క్లస్టర్ రసూల్ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి తుంగల కన్నారావు మాజీ సర్పంచ్ కారం రాణి మహిళ అధ్యక్షులు సోడే ధనలక్ష్మి, రాష్ట్ర ఎస్టీ కార్యవర్గ సభ్యులు సోడే మధుసూదన్ రావు జనసేన మండల అధ్యక్షులు
దాసరి నరేంద్ర, మాజీ సర్పంచ్ హేమంత్ గాంధీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడకం చిన్నీ, గ్రామ కమిటీ అధ్యక్షులు హెచ్ రవి పండు, పారి సోమయ్య బోడ వెంకటేశ్వర్లు నాచుపల్లి వెంకటేశ్వర్లు దన్నూరి శీను సోమేశ్వరరావు శ్రీమంతుల సతీషు ఎలాజీ, గంపల ప్రశాంత్, మేడిది నాగార్జున తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

