*కుల వివక్ష,దోపిడి,అంతరాలు లేని సమాజం కోసం పోరాడుదాం*
*కుల రహిత సమాజమే కెవిపిఎస్ లక్ష్యం*
*మహనీయులు పూలే అంబేడ్కర్ ఆశయ సాధన కోసం పోరాడుదాం*
*కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ, సభలో వక్తలు*
సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 02 (ప్రజావాణి )
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి లోని సుందరయ్య భవన్ వద్ద కెవిపిఎస్ జెండాను జిల్లా అధ్యక్షులు ఎం శివకుమార్ ఎగురవేశారు.అనంతరం జరిగిన సభకు జిల్లా కార్యదర్శి పి అశోక్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బి మల్లేష్, సిఐటియు రాష్ట్రవర్కింగ్ కమిటీ సభ్యులు ఏ.మాణిక్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.నర్సింలు,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పి అశోక్, టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బి. సాయిలు లు మాట్లాడుతూ..* జ్యోతిబాపూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు తమ జీవితాంతం కులవివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ల అయినా ఇంకా కుల వివక్ష అంటరానితనం అసమానతలు కొనసాగుతున్నాయని,కుల వివక్ష అంతరాలు లేని సమాజం కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ 1998 అక్టోబర్ రెండున ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన లక్ష్యాలతో చారిత్రిక అవసరంగా ఏర్పడిందని గత 28 సంవత్సరాల కాలంలో అనేక సమస్యలపై పోరాడిందని జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు, ఎస్సీ ఎస్టీ కమిషన్, దళితవాడల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, దళితులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, స్మశాన స్థలాలు, కులాంతర వివాహ ప్రోత్సాహకాలు కోసం పోరాడిందని రాష్ట్రంలో 153 కుల దురంకార హత్యలు జరిగాయని బాధితులకు అండగా నిలబడింది కెవిపిఎస్ అని అన్నారు ఎక్కడ కుల వివక్ష, అంటరానితనం, అవమానాలు జరిగిన బాధితుల పక్షాన ముందుండి సామాజిక ప్రజా సంఘాలను కలుపుకొని పోరాడిందని అన్నారు ప్రస్తుతం భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్నారని రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత అని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగారుస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తుందని రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాడుదామని కులవివక్ష సామాజిక అనుచివేత ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాలు నిర్వహిద్దామని అందరికీ విద్య, అందరికీ వైద్యం కోసం, కుల రహిత సమాజం కోసం పోరాడుదామని అన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రవీణ్ ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అర్జున్ సామాజిక ఉద్యమ నాయకులు మొగులయ్య అనిల్ బౌద్ధ పీఎన్ఎం జిల్లా కార్యదర్శి నాగభూషణం, పత్రికా మేనేజర్ రేవంత్ కుమార్ లు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు మల్లేశం దాసు ప్రవీణ్ సురేష్ దత్తు నర్సింలు మహేష్ కుమార్ సామాజిక ప్రజాసంఘాల నాయకులు లక్ష్మణ్ విట్టల్ ప్రమోద్ కుమార్ శ్రీనివాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.*

