కుల్కచర్ల మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మోత్కూర్ వెంకటేష్
పరిగి /కుల్కచర్ల, అక్టోబర్ 28(ప్రజావాణి )
కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మోత్కూర్ వెంకటేష్ నియమితులయ్యారు. పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సిఫార్సు మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ నియామకాన్ని ఖరారు చేసింది.
ఈ సందర్భంగా మోత్కూర్ వెంకటేష్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసంతో ఈ బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. మండలంలో పార్టీ బలోపేతానికి సీనియర్లను, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తానని చెప్పారు. ఆయన నియామకం పట్ల మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
