కిష్టాపురంలో ఘనంగా పోషక మాసం కార్యక్రమం
చిన్నారులకు అన్నప్రాసన.. పోషకాహారంపై అవగాహన
కూసుమంచి ప్రజావాణి అక్టోబర్ 6: కిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలో పోషక మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొండా సైదులు ముఖ్య అతిథిగా హాజరై పోషక మాసం ప్రాధాన్యతను వివరించారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం, సమతుల్య ఆహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు
. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న వివిధ సేవలు, కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయులు పాపారావు, ఆశా వర్కర్ ఉపేంద్ర, అంగన్వాడీ టీచర్ అక్కమ్మ, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

