📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅంగన్‌వాడీ, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయం

అంగన్‌వాడీ, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయం

📰 Generate e-Paper Clip

అంగన్‌వాడీ, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయం

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి

బెజ్జంకి, అక్టోబర్ 6 (ప్రజావాణి)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ గుర్రం ఉమ, ఆయా సోరుపాక గీత, పారిశుద్ధ్య కార్మికులు తోటపల్లి రాయమల్లు, జనగాం వనజలను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం అంగన్‌వాడీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య అవగాహన కల్పించడంలో అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ప్రజా సేవలో ముందుండే ఫ్రంట్‌లైన్ సిబ్బందిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో స్వచ్ఛత, ఆరోగ్యం, మహిళా–శిశు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ
కార్యక్రమంలో సర్పంచ్ నేరెళ్ల వెంకటలక్ష్మి రాజయ్య, బీజేపీ మండల కార్యదర్శి బీరం చంద్రారెడ్డి, బూత్ అధ్యక్షుడు జంగిడి కమలాకర్ రెడ్డితో పాటు రావుల బాల్ రెడ్డి, సోరుపాక లక్ష్మణ్, కాసం సతీష్ రెడ్డి, రావుల రాజిరెడ్డి, కొమ్ము మల్లేశం, కొమ్ము నాగరాజు, వడ్లకొండ శంకరయ్య, రావుల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.