కారోబార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ప్రవీణ్ రావు
పెద్దవంగర అక్టోబర్ 17 ప్రజావాణి
వడ్డెకొత్తపల్లి కారోబార్ చేత పరుశరాములు తండ్రి చేత ఎల్లయ్య శుక్రవారము పరామపదించినారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఎల్లయ్య తో తమ కుటుంబ సభ్యులకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డెకొత్తపల్లి సర్పంచ్ దంతాలపల్లి పరశురాములు,ఉప-సర్పంచ్ ఎర్రగొర్ల రమేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, వార్డు సభ్యులు గద్దల యాకలక్ష్మీ యాకయ్య, మాజీ వార్డు సభ్యులు దంతాలపల్లి ఎల్లయ్య, బారాజు ఉపేందర్, పాక అనిల్ కుమార్, వెల్మ బీరన్న, కొమ్మనబోయిన వెంకన్న,తడకమల్ల ఐలయ్య ఉన్నారు.

