📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాంట్రాక్టు ఉద్యోగులని శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలి

కాంట్రాక్టు ఉద్యోగులని శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

కాంట్రాక్టు ఉద్యోగులని శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలి

అనంతపురం అక్టోబర్ 10 ప్రజావాణి నగరంలోని పెద్ద ఆసుపత్రి నందు కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ ఆసుపత్రి ఆవరణ నందు ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% గ్రాస్ వేతనం చెల్లించాలి విధి నిర్వహణలో మరణించిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50 లక్షల రూపాయలు కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలన్నారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి డిమాండ్ చేశారు కోవిడ్ సమయంలో రోగికి అవసరమైన చికిత్సలు సేవలు చేశామని వారు గుర్తు చేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టిన సేవలు చేసినా కూడా మాపై ప్రభుత్వానికి దయ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.