📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాంగ్రెస్ ఘన విజయానికి కృషి చేయాలి

కాంగ్రెస్ ఘన విజయానికి కృషి చేయాలి

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ ఘన విజయానికి కృషి చేయాలి..
ఎమ్మెల్యే మురళి నాయక్
నెల్లికుదురులో ఓటు నమోదు హెల్ప్ డెస్క్ ప్రారంభం..
ప్రజావాణి,నెల్లికుదురు:
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నెల్లికుదురు మండలంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్‌ను ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ గురువారం పార్టీ మండల అధ్యక్షులు యాదవ రెడ్డి ప్రభృతుల తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో నెల్లికుదూర్ మండల పార్టీ అధ్యక్షులు యాదవ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు సురేష్,రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శివ, మాజీ మండల అధ్యక్షులు ప్రభాకర్,నాయకులు హెచ్ వెంకటేశ్వర్లు,బాలాజీ నాయక్,సత్యపాల్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు,మండల నాయకులు, ఉపసర్పంచ్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.