📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguఒకే ఒక్క తప్పు.. జీవితాంతం శిక్ష

ఒకే ఒక్క తప్పు.. జీవితాంతం శిక్ష

📰 Generate e-Paper Clip

  • .మీ ఫోటోలే మీకు శత్రువు కావచ్చు.. జాగ్రత్త.!
    .చల్వాయి మోడల్ స్కూల్ లో మోగిన సైబర్ హెచ్చరిక గంట.
    .అమాయకత్వమే వారి ఆయుధం..మీ జాగ్రత్తే మీ రక్షణ.
    .పస్రా ఎస్సై తాజుద్దీన్.

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌(ప్రజావాణి)*:-
పస్రా ఎస్ఐ తాజుద్దీన్ గారి సందేశం….
నా బిడ్డల్లారా..
మీరు నా బిడ్డలతో సమానం. మీ ముందు నేను ఎస్ఐ గా కాదు.. మీ అన్నగా, మీ తండ్రిగా మాట్లాడుతున్నా..
ఒక్కసారి ఆలోచించండి.. మీ అమ్మ మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తోంది.. మీ నాన్న మీ భవిష్యత్తు కోసం ఎండలో ఎంత చెమటోడుస్తున్నాడు..
వారి కల ఒక్కటే.. మీరు పెద్దవాళ్లు కావాలి.. గొప్పవాళ్లు కావాలి..
కానీ మీరు ఫోన్ లో తెలియకుండా నొక్కే ఒక్క లింక్.. మీ అమ్మ కలను, మీ నాన్న కష్టాన్ని ఒక్క క్షణంలో బూడిద చేస్తుంది బిడ్డా..
మీరు అమాయకంగా షేర్ చేసే ఒక్క ఫోటో.. రేపు మిమ్మల్ని సమాజంలో తలెత్తుకోకుండా చేస్తుంది..
బిడ్డా.. ఫ్రీ రీచార్జ్ లేదు.. ఫ్రీ లాటరీ లేదు.. ఫ్రీ గా వచ్చేది మోసం మాత్రమే..
ఇన్ స్టాలో మీకు మెసేజ్ చేసే ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి నిజం కాదు.. ఆ ఫోటో వెనుక 40 ఏళ్ల మోసగాడు ఉండొచ్చు..
మీ జీవితం చాలా విలువైనది బిడ్డా.. దాన్ని ఒక నకిలీ లింక్ కోసం, ఒక ఫేక్ లైక్ కోసం పోగొట్టుకోవద్దు..
మీ ఫోన్ మీ చేతిలో పుస్తకం కావాలి.. మీ భవిష్యత్తుకు వెలుగు కావాలి.. కానీ మీ జీవితాన్ని చీకటి చేసే కత్తి కాకూడదు..
ఒకవేళ ఏదైనా జరిగితే.. భయపడి ఏడవకండి.. మీ అమ్మ నాన్నకు చెప్పండి.. మాకు చెప్పండి.. మేము ఉన్నాం.. మీ కోసం 1930 ఎప్పుడూ తెరిచే ఉంటుంది..
మీరు బాగుండాలని కోరుకునే మీ పోలీస్ డిపార్ట్మెంట్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.