📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: చందుపట్ల కీర్తి రెడ్డి

బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: చందుపట్ల కీర్తి రెడ్డి

📰 Generate e-Paper Clip

బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: చందుపట్ల కీర్తి రెడ్డి

మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వినతిపత్రం సమర్పించిన ఓబీసీ మోర్చా

భూపాలపల్లి అక్టోబర్ 7 మన ప్రజావాణి : భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ ఓబీసీ మోర్చా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి పిడుగు కృష్ణ ముదిరాజు సూచనల మేరకు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దేశెట్టి గోపాల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరోసారి బీసీ వర్గాలను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
“మహేష్ కుమార్ గౌడ్ మీరు కూడా బీసీ నాయకులే కదా.. బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం మీకు ఉన్న అధికార కాలంలోనే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయవచ్చు కదా” అని కీర్తి రెడ్డి ప్రశ్నించారు. బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. అలా చేస్తేనే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు.
ఇకనైనా బీసీలను అడ్డుపెట్టుకుని మోసపూరిత హామీలు, మాయమాటలు చెప్పడం మానుకోవాలని కీర్తి రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రజలు ఇక మాయమాటలు వినేందుకు సిద్ధంగా లేరని అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, ఆ తర్వాత బీసీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం మాటలకే పరిమితం కావడం సరికాదని కీర్తి రెడ్డి అన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి అరుట్ల దశమంత రెడ్డి , ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.