📄 ePaper
Epaper 2
Sunday, October 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన జనగామ జిల్లా విద్యార్థులు

ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన జనగామ జిల్లా విద్యార్థులు

📰 Generate e-Paper Clip

*ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన జనగామ జిల్లా విద్యార్థులు*

*అభినందించిన జిల్లా ఎస్జిఎఫ్ కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): జిల్లాకు చెందిన ముగ్గురు టైక్వాండో విద్యార్థులు ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

ఇటీవల ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎస్జిఎఫ్ టైక్వాండో ఎంపిక పోటీల్లో జనగామ జిల్లా విద్యార్థులు బానోతు సంతోష్ కుమార్, కందుల నందిని, పంగ సుప్రియ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్జిఎఫ్ కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్ ఎంపికైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఇదే స్ఫూర్తితో రాణించి పతకాలు సాధించి జనగామ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థులకు వెన్నంటి నిలిచి చక్కటి శిక్షణ అందించిన టైక్వాండో మాస్టర్ ఎండి. అబ్బాస్ ని, అలాగే ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను జిల్లా కార్యదర్శి గోర్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లా క్రీడాభివృద్ధికి ఇలాంటి విజయాలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ఎస్జిఎఫ్ తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.