📄 ePaper
Epaper 2
Friday, October 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఉపాధి హామీ పథకం పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదు

ఉపాధి హామీ పథకం పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదు

📰 Generate e-Paper Clip

ఉపాధి హామీ పథకం పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదు…

వ్యవసాయ కార్మిక సంఘం
డిమాండ్.

బి కే ఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే లక్ష్మణ్.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ అమలు చేయుటలో పూర్తిగా వైఫల్యం చెందిందని బికేఎంయు జిల్లా కార్యదర్శి అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్నారని ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ రాష్ట్రానికి మరిన్ని కేటాయించి గ్రామీణ వ్యవసాయ కూలీలకు తోడ్పడాలని వారన్నారు వ్యవసాయ కూలీలకు గ్రామాల్లో పని లేక తిండి బట్ట పొట్ట లేక ఇబ్బందుల గురవుతున్నారని గ్రామీణ ఉపాధి పథకాన్ని మరిన్ని రోజులు పెంచి గ్రామాలలో వ్యవసాయ కూలీలకు పని కల్పించాలని కోరారు భూగర్భ జలాలు బావుల్లో నీళ్లు లేక వ్యవసాయ భూములు పంటలు చేతికి రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రాబోయే కాలంలో పశువులకు మూగ జంతువులకు పశు గ్రహం కూడా దొరికే లేదని ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మార్గాలు చేయాలని వ్యవసాయ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 800 రూపాయలు ఇవ్వాలని కోరారు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఉపాధి హామీ పథకాలు అమలు ఇంకా వ్యవసాయ కూలీలకు సరియైన జీవనోపాధి జరగడం లేదని ఉపాధి హామీ 2 వందల రోజులు పని దినాలు కల్పించాలని ఆయన అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో బి కే ఎన్ యు జిల్లా అధ్యక్షులు మునియాల బిక్షపతి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సాంబయ్య బిల్కురి తులసిరావ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.