📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో ముగిసిన పోషణ మాసోత్సవాలు 

ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో ముగిసిన పోషణ మాసోత్సవాలు 

📰 Generate e-Paper Clip

ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో ముగిసిన పోషణ మాసోత్సవాలు

చెన్నారావుపేట అక్టోబర్ 08 ప్రజావాణి

 

మండల కేంద్రంలోని ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో ‘పోషణ మాసం’ ముగింపు కార్యక్రమాన్ని టీచర్ మేడి సరోజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానికంగా దొరికే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, పాలు మరియు గుడ్లు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని టీచర్ సరోజన తెలిపారు. అలాగే అంగన్వాడీలో అందించే పోషకాహారాన్ని ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారాన్ని పిల్లలకు తినిపిస్తే రోగ నిరోధక శక్తి పెరిగి శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు రకాల పోషకాహార పదార్థాలను ప్రదర్శించగా, గర్భిణులు, బాలింతలు, తల్లులు మరియు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.