📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆడంబరాలకు దూరం.అనాథల ఆకలి తీర్చడమే పరమార్థం: తిరుపతిలో కవలకుంట్ల దంపతుల ఆదర్శ వివాహ వార్షికోత్సవం!

ఆడంబరాలకు దూరం.అనాథల ఆకలి తీర్చడమే పరమార్థం: తిరుపతిలో కవలకుంట్ల దంపతుల ఆదర్శ వివాహ వార్షికోత్సవం!

📰 Generate e-Paper Clip

తిరుపతి ఆగస్టు 16 ప్రజావాణి తిరుపతి జిల్లా కేంద్రంలో మానవత్వాన్ని చాటే ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. శ్రీ కవలకుంట్ల పాపయ్య, న్యాయవాది  శ్రీమతి కవలకుంట్ల స్లీవమ్మా, స్కూల్ హెడ్ మాస్టర్ దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సమాజానికి ఆదర్శంగా నిలిచేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలోని ప్రసిద్ధ జగన్ మాత చర్చి ఆవరణలో ఉన్న మదర్ థెరిసా అనాథ ఆశ్రమంలో ఈ వేడుకలను అత్యంత అర్థవంతంగా జరిపారు.అనాథల మధ్య ఆత్మీయ ఆశీర్వాదం ఆడంబరాలకు,వృథా ఖర్చులకు దూరంగా ఉంటూ,సమాజంలో ఆదరణ కరువైన అనాథల చెంత ఈ దంపతులు తమ ప్రత్యేక రోజును గడిపారు. ఆశ్రమంలోని దాదాపు 100 నుండి 150 మంది నిరుపేదలు, అనాథల సమక్షంలో చిన్న ప్రార్థన, ఆత్మీయ ఆశీర్వాద కార్యక్రమం జరిగింది. చర్చి పవిత్ర వాతావరణంలో,ఆశ్రమ నిర్వాహకులు మరియు అక్కడి నివాసితులు కవలకుంట్ల పాపయ్య, స్లీవామ్మ దంపతులు నూరేళ్ల పాటు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ వివాహ వార్షికోత్సవం కేవలం ఒక పూట వేడుకగా మిగిలిపోకుండా, ఆశ్రమంలోని 150 మందికి పైగా ఉన్న వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజన వసతిని ఘనంగా ఏర్పాటు చేశారు. రోజంతా ఆశ్రమవాసులకు కడుపునిండా రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఈ దంపతుల కుటుంబ సభ్యులు చేసిన అన్నదాన సేవ అందరి ప్రశంసలు అందుకుంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమే పరమార్థంగా భావించి చేసిన ఈ త్రికాల అన్నదానం అక్కడి వారి ముఖాల్లో ఎనలేని ఆనందాన్ని నింపింది.నేటి ఆధునిక కాలంలో పుట్టినరోజులు, పెళ్లిరోజుల పేరిట హోటళ్లలో, పబ్‌లలో వేలాది రూపాయలు వృథా చేస్తున్న సంస్కృతి పెరిగిపోతోంది. అలాంటి రోజుల్లో, తిరుపతి నగరంలో కవలకుంట్ల పాపయ్య, సిల్వమ్మ దంపతులు మరియు వారి కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం ఎందరికో స్పూర్తిదాయకం. సమాజంలోని నిస్సహాయులను ఆదుకోవడంలోనే నిజమైన తృప్తి ఉందనే సందేశాన్ని వీరు చాటిచెప్పారు.ఆదర్శ వివాహ బంధాన్ని 42 ఏళ్లుగా విజయవంతంగా సాగిస్తూ,తమ సంతోషాన్ని అనాథల ఆకలి తీర్చడంలో వెతుక్కున్న ఈ పుణ్య దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రజావాణి ఏపీ క్రైమ్ బ్యూరో తరపున హృదయపూర్వక 42వ వివాహ వార్షికోత్సవo తెలియపారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.