నన్ను అరెస్ట్ చేసి వల్లూరు పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏమిటి
సూటిగా ప్రశ్నించిన వైయస్సార్ సిపి కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం.
కమలాపురం అక్టోబర్ 18 ప్రజావాణి వైయస్సార్ సిపి మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కమలాపురం లో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మారుజోళ్ళు కవిత దగ్గర నుండి టిడిపి గుండాలు నామినేషన్ పత్రాలు లాక్కోవడం, మారుజోళ్ళు కవిత వెంబడి వెళ్లిన లక్ష్మీపై దాడులు చేయడాన్ని తెలుసుకునేందుకు కమలాపురంలోని వారి స్వగృహానికి ఆదివారం ఉదయం వెళ్ళిన నన్ను అరెస్టు చేసి వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించడం నీచం, నేను చేసిన నేరం ఏమిటని? వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైయస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, బద్వేలు, కడప, మైదుకూరు, రాజంపేట, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో టి.డి.పి గుండాలా దౌర్జన్యాలకు, అడ్డు, అదుపులేదని, ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చూస్తే అసలు ఎన్నికల కమిషన్ ఉన్నట్టా? లేనట్లా? పోలీసు శాఖ ఉన్నది ప్రేక్షక పాత్ర వహించడానికెనా? అని ఆయన నిలదీశారు. ఇలాంటి ఎన్నికలు జరపడం కన్నా స్థానిక సంస్థల ప్రతినిధులను నామినేట్ చేసుకోవచ్చు కదా? అన్నారు. రాబోవు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమందిని అడ్డుకుంటారన్నారు.ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం అంతే వాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. జిల్లాలోని వైయస్సార్ సిపి నేతలు, ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు పోచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైయస్సార్ సిపి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, మాజీ శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామి రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయా పల్లె మల్లికార్జున రెడ్డి తదితరులతో పాటు వేలాదిమంది వైసీపీ శ్రేణులు హౌస్ అరెస్ట్ లు, పోలీస్ స్టేషన్ లకు తరలించి జరిపే ఎన్నికలు ఒక ఎన్నికలేనా? అని ఆయన విరుచుకుపడ్డారు.అరెస్ట్ లతో,బెదిరింపులతో వైయస్సార్ సిపి నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ఎవరితరం కాదని రెడ్యం స్పష్టం చేశారు.

