ఆడంబరాలకు దూరం.అనాథల ఆకలి తీర్చడమే పరమార్థం: తిరుపతిలో కవలకుంట్ల దంపతుల ఆదర్శ వివాహ వార్షికోత్సవం!
తిరుపతి ఆగస్టు 16 ప్రజావాణి తిరుపతి జిల్లా కేంద్రంలో మానవత్వాన్ని చాటే ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. శ్రీ కవలకుంట్ల పాపయ్య, న్యాయవాది శ్రీమతి కవలకుంట్ల స్లీవమ్మా, స్కూల్ హెడ్ మాస్టర్ దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సమాజానికి ఆదర్శంగా నిలిచేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలోని ప్రసిద్ధ జగన్ మాత చర్చి ఆవరణలో ఉన్న మదర్ థెరిసా అనాథ ఆశ్రమంలో ఈ వేడుకలను అత్యంత అర్థవంతంగా జరిపారు.అనాథల మధ్య ఆత్మీయ ఆశీర్వాదం ఆడంబరాలకు,వృథా ఖర్చులకు దూరంగా ఉంటూ,సమాజంలో...