📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅయోధ్యాపురంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

అయోధ్యాపురంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

*అయోధ్యాపురంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు*

*హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో*

గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 14. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని అయోధ్యాపురం గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నాలుగవ రోజు హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా నాలుగవ రోజు బుధవారం రోజున హిందూ వాహిని ఉత్సవ సమితి అయోధ్యాపురం దేవి శరన్నవరాత్రులలో భాగంగా, బుధవారం రోజున అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చిన అమ్మవారు. అన్నపూర్ణేశ్వరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారి సన్నిధిలో పుణ్య దంపతుల జంటలు కుంకుమ పూజా కార్యక్రమం అయ్యవారు మంత్రోత్సరముల, అష్టోత్తరములతో ఘనంగా దేవి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం దాతలు ముత్యం భాస్కర్ పూలమ్మ పుణ్య దంపతులు వితరణ చేయగా, ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా హిందూ వాహిని ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గా దేవి మాలధార భక్తులు, హిందూ వాహిని ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, అయోధ్య పురం భక్తజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.