📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఅక్టోబర్ 5 - ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం: గురువుల త్యాగానికి గుర్తింపు

అక్టోబర్ 5 – ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం: గురువుల త్యాగానికి గుర్తింపు

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 5 – ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం: గురువుల త్యాగానికి గుర్తింపు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 వ తేదీని ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం (World Teachers’ Day) గా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఉపాధ్యాయుల కృషిని, వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ యునెస్కో (UNESCO) 1994లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. 1966లో , ఐఎల్ఒ, యునెస్కొ సంయుక్తంగా ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలపై చేసిన సిఫార్సులను పురస్కరించుకుని ఈ తేదీని ఎంపిక చేశారు. ఈ సంవత్సరం ఈ దినోత్సవం మరింత ప్రత్యేకం 1966 సిఫార్సులు వచ్చి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులకు కృతజ్ఞతలు తెలిపే రోజు. ఉపాధ్యాయుల సమస్యలు, వేతనాలు, పని పరిస్థితులపై చర్చించే రోజు. నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలని గుర్తుచేసే రోజు. భారతదేశంలో సెప్టెంబర్ 5 న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోగా, అక్టోబర్ 5 న అంతర్జాతీయంగా జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయు సంబంధించిన పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.