అంగన్‌వాడీ, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయం
అంగన్‌వాడీ, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి బెజ్జంకి, అక్టోబర్ 6 (ప్రజావాణి) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ గుర్రం ఉమ, ఆయా సోరుపాక గీత, పారిశుద్ధ్య కార్మికులు తోటపల్లి రాయమల్లు,...