📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణWanaparthyశ్రీశైలం 98 జీవో నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి

శ్రీశైలం 98 జీవో నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

శ్రీశైలం 98 జీవో నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి

-సీఎం హామీని అమలు చేయాలి

-2 వేల మంది ఎదురుచూపులు.. 182 మందికే ఉద్యోగాలు
మంత్రి జూపల్లి చొరవ తీసుకుని సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్వాసితుల డిమాండ్‌!


ప్రజావాణి స్పాట్ న్యూస్  సెప్టెంబర్ 14


చిన్నంబావి: శ్రీశైలం 98 జీవో నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. చిన్నంబావి మండల కేంద్రంలో సోమవారం 98 జీవో నిర్వాసితుల అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాసితుల ప్రతినిధి డాగోజిరావు మాట్లాడుతూ.. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 182 మందికి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. చిన్నంబావి హంద్రీ  చెట్టు కింద నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, 1986లో దీనికి క్యాబినెట్‌ ఆమోదం లభించిందన్నారు. అయితే ఇప్పటివరకు 182 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయని.. మరో సుమారు 2 వేల మంది ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జటప్రోల్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి 98 జీవో నిర్వాసితులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని అమలు చేసి నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 98 జీవో నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఏళ్ల తరబడి ఎదురుచూపులేనా!

182 ఉద్యోగాలతో సరిపెట్టొద్దు.. మిగిలిన సుమారు 2 వేల మంది కుటుంబాలకు న్యాయం చేయాలని నిర్వాసితుల డిమాండ్‌.ఈ కార్యక్రమంలో డాగోజిరావు. రాఘవేంద్రశెట్టి, మంచాలకట్ట బాలయ్య, హుస్సేన్‌నాయుడు, రంగస్వామి, నటరాజ్, జాంగీర్, షబ్బీర్‌అలీ, మహబూబ్, ఉత్తరన్నగౌడ్, నరసింహ, మేకల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య.రాముడు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.