📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiri120 జట్లతో ఘనంగా బస్తీ స్పోర్ట్స్ అకాడమీ క్రీడా పోటీలు....కబడ్డీ, వాలీబాల్‌లో విజేతలకు అభినందనలు

120 జట్లతో ఘనంగా బస్తీ స్పోర్ట్స్ అకాడమీ క్రీడా పోటీలు….కబడ్డీ, వాలీబాల్‌లో విజేతలకు అభినందనలు

📰 Generate e-Paper Clip

అన్నోజిగూడ, ఆగస్టు 31: బస్తీ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీల్లో 120 జట్లు పాల్గొన్నాయి. వివిధ వయస్సుల బాలబాలికలకు నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.

19 ఏళ్ల లోపు బాలుర కబడ్డీలో యువ పల్టాన్ జట్టు విజేతగా, పోచారం జట్టు రన్నరప్‌గా నిలిచింది. 16 ఏళ్ల లోపు బాలుర కబడ్డీలో సెయింట్ జోసెఫ్ బెతనీ నవజీవన్ విద్యాలయ జట్టు విజేతగా, శ్రీనగర్ బస్తీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. 17 ఏళ్ల లోపు బాలికల కబడ్డీలో శ్రీనగర్ బస్తీ జట్టు విజేతగా, సెయింట్ మేరీ బెతనీ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

19 ఏళ్ల లోపు బాలుర వాలీబాల్‌లో ఆదర్శపల్లి జట్టు విజేతగా, చెంగిచెర్ల జట్టు రన్నరప్‌గా నిలిచింది. 16 ఏళ్ల లోపు బాలుర వాలీబాల్‌లో జాకబ్ పాఠశాల జట్టు విజేతగా, జైన్ హెరిటేజ్ పాఠశాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. 17 ఏళ్ల లోపు బాలికల వాలీబాల్‌లో ఆదర్శపల్లి జట్టు విజేతగా, ఎంహెచ్‌ఎస్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవి ప్రకాష్, వెంకటరెడ్డి, రమేష్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బద్దం నరసింహారెడ్డి, ఆర్. భోజారెడ్డి, పి. భాస్కర్ రెడ్డి, ఆకిటి బాల్ రెడ్డి, పి. కృష్ణారెడ్డి, పి. తిరుమల రెడ్డి, బి. రమణారెడ్డి, ఎం. సుధాకర్, పి. నర్సింగ్ రావు, ఏ. మహేష్ గౌడ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాయామ ఉపాధ్యాయులు పి. మల్లేష్, నరేందర్, ఎం. విజయ్ కుమార్, పి. నాగేష్, వెంకటేష్, రాకేష్, భాస్కర్, రమేష్, వినీత్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు, రన్నరప్ జట్లకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.