120 జట్లతో ఘనంగా బస్తీ స్పోర్ట్స్ అకాడమీ క్రీడా పోటీలు….కబడ్డీ, వాలీబాల్‌లో విజేతలకు అభినందనలు

అన్నోజిగూడ, ఆగస్టు 31: బస్తీ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీల్లో 120 జట్లు పాల్గొన్నాయి. వివిధ వయస్సుల బాలబాలికలకు నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. 19 ఏళ్ల లోపు బాలుర కబడ్డీలో యువ పల్టాన్ జట్టు విజేతగా, పోచారం జట్టు రన్నరప్‌గా నిలిచింది. 16 ఏళ్ల లోపు బాలుర కబడ్డీలో సెయింట్ జోసెఫ్ బెతనీ నవజీవన్ విద్యాలయ జట్టు విజేతగా, శ్రీనగర్ బస్తీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. 17 ఏళ్ల లోపు...