స్వర్ణ అనంతరాజుపురం పంచాయతీలో ‘స్వచ్ఛ భారత్’ వినూత్న ప్రయోగం: చెత్తను వేరు చేసి ఇస్తే దసరాకు బంపర్ బహుమతులు!

బద్వేల్ సెప్టెంబర్ 25 ప్రజావాణి స్వర్ణ అనంతరాజుపురం:గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో తడి, పొడి చెత్త నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు స్వర్ణ అనంతరాజుపురం గ్రామపంచాయతీ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి, గౌరవ ఎంపీడీఓ శ్రీ ఎం. రమణారెడ్డి, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీ S. విజయ్‌కుమార్ సంయుక్తంగా గ్రామంలో విస్తృత పర్యటన చేపట్టారు. స్వర్ణ అనంతరాజు పురం మరియు నక్కలగండి గ్రామాల్లోని ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి, బిన్ బ్యాగ్’లను ఎలా ఉపయోగించాలనే అంశంపై...