స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నిరసన హరీష్‌రావు, తాతా మధుసూదన్ ఫ్లెక్సీ దహనం
నంగునూరు, సెప్టెంబర్ 8 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నాయకులు తన్నీరు హరీష్‌రావు, తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నంగునూరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనరాజు నాగరాజు, రాంపూర్ మగ్దంపూర్ మాజీ ఎంపిటిసి ఎనగందుల నితిన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అచ్చిన సత్తయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్‌రావు, తాతా మధుసూదన్‌ల ఫ్లెక్సీని...