📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyసీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం

సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం

📰 Generate e-Paper Clip

సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం

షాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజావాణి):
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పోలీస్ స్టేషన్‌లో సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలను షాబాద్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మల్కి ప్రవీణ్ మర్యాదపూర్వకంగా శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా మల్కి ప్రవీణ్ మాట్లాడుతూ మాదిగ బిడ్డలకు ఎలాంటి అన్యాయం జరగకుండా సహకరించాలని సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలను కోరినట్లు తెలిపారు. పోలీసుల సహకారంతో ప్రజలకు న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షులు ముక్కు విశ్వం మాదిగ, మండల ఉపాధ్యక్షులు కాడిగాని ప్రవీణ్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు రవీందర్ మాదిగ, మండల కోశాధికారి యాదగిరి మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.