సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
షాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజావాణి):
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పోలీస్ స్టేషన్‌లో సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలను షాబాద్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మల్కి ప్రవీణ్ మర్యాదపూర్వకంగా శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మల్కి ప్రవీణ్ మాట్లాడుతూ మాదిగ బిడ్డలకు ఎలాంటి అన్యాయం జరగకుండా సహకరించాలని సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలను కోరినట్లు తెలిపారు. పోలీసుల సహకారంతో ప్రజలకు న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షులు ముక్కు విశ్వం మాదిగ, మండల ఉపాధ్యక్షులు కాడిగాని ప్రవీణ్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు రవీందర్ మాదిగ, మండల కోశాధికారి యాదగిరి మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.