EVENING EDITION
📄 ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్వైద్యం కోసం పేదలు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాకూడదు- ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు...

వైద్యం కోసం పేదలు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాకూడదు- ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం -ఓహోఇండియా ఆరోగ్య సంరక్షణ యాజమాన్యం

📰 Generate e-Paper Clip

ప్రైమరీ సభ్యుడికి రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా రక్షణ

బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి)

వైద్యం కోసం అప్పులు చేసే పరిస్థితి ఏ పేద కుటుంబానికీ రాకూడనే లక్ష్యంతో, పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య తెలిపారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఓహోఇండియా హెల్త్ బెనిఫిట్స్ అకౌంట్ ద్వారా సభ్యులకు పలు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.

 

ఏడాదికి 24 సార్లు నగదు రహిత వైద్య సంప్రదింపులు

నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు ఏడాదికి మొత్తం 24 సార్లు నగదు రహితంగా వైద్యులను సంప్రదించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సర్వీస్ క్రెడిట్స్ వాలెట్ గరిష్ట విలువ రూ.12,000గా పేర్కొన్నారు. అలాగే నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్య బిల్లులపై 30 శాతం వరకు రాయితీ పొందే స్మార్ట్ సేవింగ్స్ వాలెట్ సదుపాయం ఉందని, దీని గరిష్ట విలువ రూ.25,000గా ఉంటుందని తెలిపారు.

రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా రక్షణ

18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌కు ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత సంపూర్ణ అంగవైకల్యం, శాశ్వత పాక్షిక అంగవైకల్యానికి రూ.1 లక్ష వరకు బీమా రక్షణ అందుబాటులో ఉంటుందని వివరించారు. ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరితే రూ.10,000 వరకు లేదా వాస్తవ ఖర్చు, ఏది తక్కువైతే అది వర్తిస్తుందని తెలిపారు.

ఆసుపత్రిలో చేరితే రోజుకు రూ.500

ఇన్‌పేషెంట్‌గా ఆసుపత్రిలో చేరినప్పుడు రోజుకు రూ.500 చొప్పున గరిష్టంగా 30 రోజుల వరకు హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ లభిస్తుందని తెలిపారు. ICUలో చేరినప్పుడు సాధారణ డైలీ క్యాష్‌కు అదనంగా మరో 100 శాతం ప్రయోజనం వర్తిస్తుందని పేర్కొన్నారు. AYUSH చికిత్సకు గరిష్టంగా 15 రోజుల వరకు ప్రయోజనం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
అంత్యక్రియల ఖర్చులకు రూ.5,000 వరకు, మృతదేహ రవాణాకు బీమా మొత్తంలో 2 శాతం లేదా రూ.5,000లో ఏది తక్కువైతే అది వర్తిస్తుందని వివరించారు. అయితే అన్ని ప్రయోజనాలు సంబంధిత నిబంధనలు, అర్హతలు, వెయిటింగ్ పీరియడ్‌కు లోబడి ఉంటాయని తెలిపారు. 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో పాటు ముందుగా ఉన్న వ్యాధులకు (PED) ప్రత్యేక వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, దుగ్యాని మోహన్, కేడిక మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, శ్రీధర్, సమ్మయ్య, ఇన్సూరెన్స్ యాజమాన్య ప్రతినిధులు ప్రభంజన్, శ్రీకాంత్, ప్రశాంత్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.