ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
-ఉపాధ్యాయుడి చేతిలో పుస్తకం మాత్రమే కాదు – ఒక తరం భవిష్యత్తు ఉంటుంది,
-ఎంఈఓ బుధారపు శ్రీనివాస్,
పెద్దవంగర, సెప్టెంబర్ 09 ప్రజావాణి
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దవంగర మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి,
మండల విద్యాశాఖ అధికారి బుదారపు శ్రీనివాస్ సభాధ్యక్షత జరిగిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ వినోద్ కుమార్ మరియు పెద్దవంగర సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ హాజరయ్యారు.
బుదారపు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…
“ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదు.. సమాజ భవిష్యత్తును నిర్మించే మహత్తర బాధ్యత. ఒక మంచి ఉపాధ్యాయుడు విద్యార్థికి పాఠ్యాంశాలను మాత్రమే బోధించకుండా, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పుతారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం నిబద్ధతతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డులు మరింత మంది ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచి, విద్యా ప్రమాణాల పెంపునకు దోహదపడాలి” అని అన్నారు.
ఎమ్మార్వో వినోద్ కుమార్ మాట్లాడుతూ…
“ఒక దేశ ప్రగతికి పునాది విద్య. ఆ విద్యకు దిశానిర్దేశం చేసే వారు ఉపాధ్యాయులు. ఒక విద్యార్థి విజయవంతమైన జీవితాన్ని సాధించినప్పుడు దాని వెనుక తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుని కృషి కూడా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, వారి ప్రతిభను వెలికితీస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ప్రతి ఒక్కరికీ అభినందనలు” అని తెలిపారు.
పెద్దవంగర సర్పంచ్ శ్రీమతి పారిజాత మాట్లాడుతూ…ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు. వారు తరగతి గదిలో విద్యార్థులకు అందించే జ్ఞానం వారి జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మన మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఒకే వేదికపై సన్మానించడం గర్వకారణం. ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంతో పనిచేసి మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సన్మాన గ్రహీతలు:
1. లీలా శోభారాణి – జిహెచ్ఎం, జెడ్ పి హెచ్ ఎస్-బొమ్మకల్
2. జి.యాకయ్య – ఎల్ ఎఫ్ ఎల్, హెచ్ఎం ,ఎంపీపీఎస్ -చిట్యాల
3. జె.రమేష్ – ఎస్ ఏ, మ్యాథ్స్ , జెడ్ పి హెచ్ ఎస్ -చిట్యాల
4. బి సురేంద్ర కుమార్ –ఎస్ ఏ (బయోలాజికల్ సైన్స్), జెడ్ పి హెచ్ ఎస్- వడ్డెకొత్తపల్లి
5. కే. హైమ –ఎస్ ఏ (ఫిజికల్ సైన్స్), జెడ్ పి హెచ్ ఎస్- పెద్దవంగర
6. కే. శ్రీను – ఎస్ ఏ(బయలాజికల్ సైన్స్), పిఎంశ్రీ జెడ్ పి హెచ్ ఎస్- ఔతాపురం
7. ఏ. మంజుల – ఎస్ జి టి ఎంపియుపిఎస్- గంట్లకుంట
8. బి. రవి – ఎస్ జి టి, ఎంపీ యుపిఎస్ -కొరిపల్లి
9. వీ. శ్రీనివాస్ – ఎస్ జి టి ఎంపీ యుపిఎస్- చిన్నవంగర
10. ఎం. మెహబూబీ – ఎస్ జి టి ఎంపీపీ ఎస్ -ఎల్ బి తండా
11. కే. మధుసూదన్ రెడ్డి – ఎంపీపీ ఎస్- కొరిపల్లి తండా
12. ఏ. ప్రదీప్ –ఎస్ జి టి, ఎంపీపీఎస్- పెద్దవంగర
13. పి. కళ్యాణి – సి ఆర్ టి (బయోలాజికల్ సైన్స్), కేజీబీవీ- పెద్దవంగర
14. పి. రంగయ్య – సిఅర్పి, జెడ్పిహెచ్ఎస్ -చిట్యాల
ఉపాధ్యాయులందరూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఘన సన్మానంతో పాటు ప్రశంస పత్రాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలందరూ తమకు లభించిన గౌరవం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల అభ్యున్నతి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కళాధర్, శేషవల్లి, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

