*దళిత, గిరిజనుల ఆత్మగౌరవమే ధ్యేయం – ఢిల్లీ సభలో జనగామ గళం వినిపించిన డా. లక్ష్మీనారాయణ నాయక్*
*డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ లు మల్లు రవి, బలరాం నాయక్ తో కలిసి పాల్గొన్న జనగామ నేత*
జనగామ, సెప్టెంబర్ 29 (ప్రజావాణి):
ఢిల్లీలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో జనగామ జిల్లా తరపున వై టి డి ఏ సభ్యులు, టీపీసీసీ సభ్యులు డా. లక్ష్మీ నారాయణ నాయక్ పాల్గొన్నారు.
ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి, మాజీ కేంద్ర మంత్రి ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, మురళీ నాయక్, రాందాస్ నాయక్, తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి అత్యధిక సంఖ్యలో ఎస్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా ఎస్టీ సెల్ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రత్యేక కృషి చేశారని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డా. లక్ష్మీ నారాయణ నాయక్ మాట్లాడుతూ, దళిత, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

