📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవీరనారి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

వీరనారి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

📰 Generate e-Paper Clip

*వీరనారి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం*

*ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ*

* *మన ప్రజావాణి* మందమర్రి:-

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని సింగరేణి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ తెలిపారు. ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని శనివారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ, భూమికోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. దొరల దౌర్జన్యాలకు తలవంచక, రజాకారుల పెత్తనానికి భయపడక, అన్యాయానికి ఎదురు నిలిచి, అణగారిన ప్రజల గొంతుగా మారిన ధీరవనిత ఆమె అని, అటువంటి గొప్ప యోధురాలని జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషకరం, అత్యంత గర్వకారణమని తెలిపారు. ప్రజాస్వామ్య పోరాటాలకు మారదర్శి చాకలి ఐలమ్మ అని, నేటి యువత ముఖ్యంగా మహిళలు ఆమె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో న్యాయం, సమానత్వం కోసం పనిచేస్తూ, కష్టపడే తత్వానికి గుర్తింపు ఇవ్వడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం జిఎల్ ప్రసాద్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, డిజిఎం పర్సనల్ సిహెచ్ అశోక్, సీఎంఓఏఐ ఏరియా జాయింట్ కార్యదర్శి బాలాజీ భగవతి జ, ఏజిఎం ఎఫ్ అండ్ ఏ ఆర్విఎస్ఆర్కే ప్రసాద్, డిజిఎం సర్వే భూక్య దేశాయ్, ఏరియా సెక్యూరిటీ అధికారి(ఎస్ అండ్ పిసి ఎస్ఎస్ఓ) వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ పిఓ ఎం కార్తీక్, డివైఎఫ్ఎం ఎఫ్ అండ్ ఏ ఏ సరిత, జిఎం కార్యాలయ ఏఐటియుసి పిట్ కార్యదర్శి గీతిక, జిఎం కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.