📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్వినాయక ఉత్సవ కమిటీలకు ముఖ్య గమనిక

వినాయక ఉత్సవ కమిటీలకు ముఖ్య గమనిక

📰 Generate e-Paper Clip

వినాయక ఉత్సవ కమిటీలకు ముఖ్య గమనిక

పసర ఎస్సై తాజుద్దీన్

గోవిందరావుపేట (ప్రజావాణి)

గోవిందరావుపేట మండల ప్రజలకు మరియు వినాయక ఉత్సవ కమిటీలకు ముఖ్య గమనికగోవిందరావుపేట: మండలంలో జరగబోయే వినాయక నిమజ్జన మహోత్సవాలను పురస్కరించుకుని పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల సౌకర్యార్థం వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది.
ఈ నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా నిమజ్జనంలో డీజేలు ఏర్పాటు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.
ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు మండల ప్రజలు ఈ నిబంధనలను పాటించి, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ముగించుకోవడానికి పోలీస్ శాఖకు పూర్తిగా సహకరించవలసిందిగా కోరడమైనది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.