📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవినాయకుడి లడ్డూకు రూ.2.52 లక్షలు

వినాయకుడి లడ్డూకు రూ.2.52 లక్షలు

📰 Generate e-Paper Clip

వినాయకుడి లడ్డూకు రూ.2.52 లక్షలు!

లడ్డూను సొంతం చేసుకున్న పొనుగోటి రమేష్‌రావు దంపతులు

కూకట్‌పల్లి విలేజ్, సెప్టెంబర్ 29 (ప్రజావాణి)

కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది. భక్తులు ఆసక్తిగా పాల్గొన్న ఈ వేలంలో వినాయకుడి లడ్డూ రూ.2,52,000 ధర పలికింది.
ఈ వేలంలో దేవస్థానం హోమ్స్‌లోని విల్లా నంబర్ 26కు చెందిన పొనుగోటి రమేష్‌రావు దంపతులు లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలం అనంతరం ఆలయ నిర్వాహకులు రమేష్‌రావు దంపతులను అభినందించారు. వినాయకుడి లడ్డూకు భారీ ధర పలకడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.