వినాయకుడి లడ్డూకు రూ.2.52 లక్షలు!
లడ్డూను సొంతం చేసుకున్న పొనుగోటి రమేష్‌రావు దంపతులు
కూకట్‌పల్లి విలేజ్, సెప్టెంబర్ 29 (ప్రజావాణి)
కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది. భక్తులు ఆసక్తిగా పాల్గొన్న ఈ వేలంలో వినాయకుడి లడ్డూ రూ.2,52,000 ధర పలికింది.
ఈ వేలంలో దేవస్థానం హోమ్స్‌లోని విల్లా నంబర్ 26కు చెందిన పొనుగోటి రమేష్‌రావు దంపతులు లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలం అనంతరం ఆలయ నిర్వాహకులు రమేష్‌రావు దంపతులను అభినందించారు. వినాయకుడి లడ్డూకు భారీ ధర పలకడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.